Sarkar Live

Fire Accident : గుల్జార్‌హౌస్‌ అగ్నిప్ర‌మాదంపై ద‌ర్యాప్తు

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌‌లో మే18వ తేదీ తెల్లవారుజామున జ‌రిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident) అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో 17మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీనికి గల కారణాలను గుర్తించారు.

Fire Accident

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌‌లో మే18వ తేదీ తెల్లవారుజామున జ‌రిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident) అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో 17మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీనికి గల కారణాలను గుర్తించారు. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ కు ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని అగ్నిమాప‌క‌ అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులుతెలిపారు. కంప్రెషర్ పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయని గుర్తించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుందని చెప్పారు.

ఫస్ట్‌, సెకండ్ ఫ్లోర్లలోకి దట్టంగా పొగ వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించారు. టెర్రస్‌ నుంచి బయటకు రాలేక కుటుంబసభ్యులు మళ్లీ కిందకు వచ్చారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే కుటుంబ సభ్యులు ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారక స్థితిలోకి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?