Sarkar Live

Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..

Surya New Movie with venky atluri | సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు వెంకీ అట్లూరి(venky atluri). ఆయన గత రెండు సినిమాలను తీసుకుంటే తెలుగు హీరోలతో కాకుండా వేరే భాష హీరోలతో

Surya 26 OTT Deal

Surya New Movie with venky atluri | సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు వెంకీ అట్లూరి(venky atluri). ఆయన గత రెండు సినిమాలను తీసుకుంటే తెలుగు హీరోలతో కాకుండా వేరే భాష హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొట్టాడు. ఇప్పుడు అదే వరుసలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) తో మూవీ చేయబోతున్నాడు.

కొన్ని రోజులుగా స్క్రిప్ట్ పై వర్క్ చేసిన మూవీ టీం లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. హీరో సూర్య గజిని సినిమాతో తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తను తీసిన ఏ సినిమా అయినా కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్టు అందుకున్నాడు.

ఎప్పటినుంచో తెలుగులో ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య కూడా మంచి కథ వస్తే తెలుగులో మూవీ చేయడానికి సిద్ధమని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ నుండి వచ్చే మూవీస్ పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతుండడంతో అందరు హీరోలు ఇక్కడి డైరెక్టర్ లతో మూవీస్ చేయడానికి వెనుకాడడం లేదు.

Surya 46వ మూవీ…

ధనుష్ (Dhanush) సార్ మూవీ ని, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ ని తీసి భారీ విజయాలను అందుకున్నారు. వెంకీ అట్లూరి చెప్పిన కథ సూర్య(Surya )కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో సూర్య స్ట్రెయిట్ తెలుగు సినిమా కల నెరవేరనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై (Sithaara Entertainments) సూర్య 46వ సినిమాగా వస్తున్న ఈ మూవీని సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ప్రేమలో మూవీ హీరోయిన్…

ఈ మూవీలో ప్రేమలో మూవీతో ఆకట్టుకున్న హీరోయిన్ మమిత బైజు (Mamitha Byju) హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ అట్లూరి మూవీస్ కి వరుసగా మ్యూజిక్ ఇస్తూ అదరగొడుతున్న జీవీ ప్రకాష్ కుమార్ ఈ మూవీకి కూడా మ్యూజిక్ ని అందిస్తున్నారు. వెంకీ అట్లూరి జీవి ప్రకాష్ కుమార్ కాంబోలో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఎమోషనల్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో ఇవ్వడంతో ఆ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. మళ్ళీ ఈ మూవీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, ఎడిటర్ నవీన్ నూ లి, ఆర్ట్ డైరెక్టర్ గా బంగ్లాన్ పనిచేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!