OG Movie update | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan)కొంత విరామం తరవాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. తను వరుసగా సైన్ చేసిన మూవీలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.దాదాపు 5 సంవత్సరాలుగా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Harihara veeramallu) ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ దానికి సంబంధించిన డబ్బింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు.
ఈ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైన్ చేసిన మూవీల్లో ఓజీ(OG) కూడా ఉంది. సగానికి పైనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల బ్రేక్ పడింది. ప్రజెంట్ పవన్ ఈ మూవీని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చాడు.
ముంబాయిలో OG Movie షూటింగ్..
ముంబాయిలో ప్లాన్ చేసుకున్న కీలక షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు.పవన్ షూటింగ్ లో ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వెలిశాయి. సుజిత్ (Sujeeth) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ గా తమ అభిమాన హీరో బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తాడో చూడాలని ఎదురు చూస్తున్నారు. కొంత కాలం కింద రిలీజ్ చేసిన పవర్ స్టార్ గ్లింప్స్ కి సోషల్ మీడియా షేక్ అయింది. ఇక మూవీ వస్తె ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో మనం ఊహించొచ్చు.
ఇమ్రాన్ హాష్మి కి డెంగ్యూ…
ఇక వరుసగా షూటింగ్ జరుపుకుంటుంది అనుకుంటుండగా ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్న ఇమ్రాన్ హాష్మి (Emraan Hashmi)అనారోగ్యం భారిన పడ్డాడు. ముంబాయి లోని ఓ కాలనీలో మూవీ టీం పవన్, ఇమ్రాన్ కి మధ్య వచ్చే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేయగా సడన్ గా ఇమ్రాన్ కి డెంగ్యూ జ్వరం సోకిందట. ఈ విషయం తెలిసిన మూవీ టీం షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చిందట. ఇమ్రాన్ కి ఫీవర్ తగ్గాకే షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. తమన్ (Taman)మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై (dvv entertainments bannar)దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.