Rains Forecast : రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల ఐదురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ద్రోణి ప్రభావం కొనసాగుతుండగా, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Rains Forecast : జిల్లాల వారీగా వర్ష సూచనలు:
ఆదివారం (జూన్ 8):
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్ష సూచన.
సోమవారం (జూన్ 9):
ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం.
మంగళవారం (జూన్ 10):
నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్ష సూచన.
బుధవారం (జూన్ 11):
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్ష సూచన.
రాబోయే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ (IMD Rains Forecast) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రయాణాలు తప్పించుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.