Sarkar Live

బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!

Akhanda 2 Teaser | బోయపాటి బాలయ్య కాంబోలో (Boyapati- Balayya combo) వచ్చిన అఖండ (Akhanda) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు. బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన మాస్ యాక్షన్ కి ఆడియన్స్

Akhanda 2 Teaser

Akhanda 2 Teaser | బోయపాటి బాలయ్య కాంబోలో (Boyapati- Balayya combo) వచ్చిన అఖండ (Akhanda) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు. బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన మాస్ యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్టును అందించింది.

అంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రజెంట్ అఖండ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 (Akhanda 2)మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.దీంతో పాటే మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేసింది.బాలయ్య మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, డివోషనల్ వైబ్ తో టీజర్ అదిరిపోయింది.

స్టార్టింగ్ లో నే బాలయ్య హిమాలయాల్లో శూలం పట్టుకుని నడిచి వస్తుండడం చూస్తే మూవీలో విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నట్టు అర్థమవుతుంది. గన్నులతో వచ్చిన విలన్లను శూలం మీద ఉంచి ‘ శివుడు ఆజ్ఞ లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు….అనుకుంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ పూనకాలు తెప్పిస్తుంది. శూలం మీద వారిని అమాంతం పైకి లేపి వారిని విసరగొట్టిన తీరు, అప్పుడు వచ్చే బిజీఎం అదరగొట్టేసింది.

Akhanda 2 సెప్టెంబర్ 25న రిలీజ్..

ఆ తర్వాత బాలయ్య చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. శూలం తిప్పుతూ బాలయ్య విలన్లను చంపడం టీజర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. బాలయ్య మాస్ యాక్షన్ అంటే ఇది కదా అనిపించేలా ఉంది. సెప్టెంబర్ 25 న (September 25)దసరా సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.టీజర్ లో బాలయ్య తాండవాన్ని చూసిన నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జై బాలయ్య… ఇది కదా మాకు కావాల్సింది అని పోస్టులు పెడుతున్నారు.

మరోసారి నందమూరి – తమన్…

తమన్ (Taman) బిజీఎం కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వేరే లెవల్లో మ్యూజిక్ కొట్టాడని, మరోసారి నందమూరి తమన్ అనిపించుకున్నాడని అంటున్నారు. భారీ అంచనాలతో రాబోయే ఈ మూవీతో బాలయ్య బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సంయుక్త మీనన్, అది పినిశెట్టి తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ మూవీని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపి ఆచంట తో కలిసి బాలయ్య తనయ తేజస్విని నిర్మిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?