Sarkar Live

20న ‘సితారే జమీన్ పర్’ విడుదల – మళ్లీ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ – Sitaare Zameen Par

Sitaare Zameen Par | ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ ని అలరించే హీరో అమీర్ ఖాన్(Ameer Khan). ఫ్యాన్స్ అందరు మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకొని ఈ హీరో రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద

Sitaare Zameen Par

Sitaare Zameen Par | ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ ని అలరించే హీరో అమీర్ ఖాన్(Ameer Khan). ఫ్యాన్స్ అందరు మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకొని ఈ హీరో రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొదటిసారి బాలీవుడ్లో 100 కోట్లు కొట్టిన మూవీ గజిని(Ghajini). దానికి మించి త్రీ ఇడియట్స్, ధూమ్ 3,పీకే,దంగల్ (Dhangal) ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.

ఇప్పటికి కూడా దంగల్ మూవీ 2000 కోట్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ చరిత్రలో ఏ మూవీ కూడా ఆ కలెక్షన్లను ఇంతవరకు బ్రేక్ చేయలేదంటే అమీర్ ఖాన్ సత్తా ఏంటో అర్థమవుతుంది. అమీర్ నుండి వచ్చిన గత సినిమా లాల్ సింగ్ చద్దాకి సరైన ఫలితం రాలేదు. దాదాపు 180 కోట్ల తో తీసిన మూవీ 130 కోట్లు మాత్రమే రాబట్టి అమీర్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది.

గత ఫ్లాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ…

ఆ మూవీ తర్వాత అమీర్ కొద్ది కాలం పాటు ముఖానికి రంగేసుకోలేదు. ఇక ఇప్పుడు పాత అమీర్ ను చూపించేలా ఆడియన్స్ ముందుకొస్తున్న మూవీ సితారే జమీన్ పర్(sitaare jameen par). స్పానిష్ మూవీ చాంపియన్ ని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీని ఆర్ ప్రసన్న డైరెక్షన్ చేశారు. మూవీ హిందీ ట్రైలర్ ఇంతకుముందే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీం.

Sitaare Zameen Par ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్

దీన్ని చూసిన ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది కదా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ అంటే అని పోస్టులు పెడుతున్నారు. ఇంటలెక్చువల్ డిజబులిటీ ఉన్న వాళ్లకి బాస్కెట్ బాల్ శిక్షణ ఇచ్చే కోచ్ గా యాక్ట్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కినట్టు అర్థమవుతుంది.

ఒక బాస్కెట్ బాల్ కోచ్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే అతడికి కోర్టు ఇంటలెక్టువల్ డిజబులిటి వాళ్ళకు బాస్కెట్ బాల్ శిక్షణ ఇవ్వాలని శిక్ష వేస్తుంది. వారికి శిక్షణ ఇచ్చి ఛాంపియన్స్ గా నిలబెట్టడమే స్టోరీ అని తెలుస్తోంది. వారిలో కూడా చాలా టాలెంట్ ఉంటుందని, వారిని పిచ్చొల్లల చూడొద్దని తెలియజెప్పారని అనిపిస్తోంది. కోచ్ గా ఇలాంటి క్యారెక్టర్ లు చేయడం అమీర్ కి నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. పూర్తి ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ (Sitaare Zameen Par) జూన్ 20వ తేదీన రిలీజ్ అవుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!