IAS transfers in Telangana 2025 | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్, దిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా శంకరయ్య, రిజిస్ట్రేషన్స్ అండ్స్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించింది.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్, సమాచార శాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, మహిళా-శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సృజనకు అదనపు బాధ్యతలు, నిజామాబాద్ కలెక్టర్‌గా టీ వినయ్ కృష్ణారెడ్డి, వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్ శివశంకర్‌ని నియమించింది. శివశంకర్‌కు విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
IAS transfers ఇక సిద్దిపేట కలెక్టర్‌గా కె.హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పి.గౌతమ్‌ను నియమించింది. మత్స్యశాఖ డైరెక్టర్‌గా కె.నిఖిల, పర్యటకశాఖ ఎండీగా వల్లూరి క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవోగా పి.ఉదయ్ కుమార్, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్యను బదిలీ చేసింది. ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్‌గా ముజామిల్ ఖాన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS transfers బదిలీ అయిన అధికారుల జాబితా
అధికారి పేరు | బదిలీఅయిన స్థానం |
---|---|
ఎన్. శ్రీధర్ | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి |
లోకేశ్ కుమార్ | రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి |
నవీన్ మిట్టల్ | ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి |
జ్యోతి బుద్ధ ప్రకాశ్ | ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి |
శశాంక్ గోయల్ | తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ) |
దాసరి హరిచందన | హైదరాబాద్ కలెక్టర్ |
శంకరయ్య | TG ఆయిల్ ఫెడ్ ఎండీ |
రాజీవ్ గాంధీ హనుమంతు | రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీ |
E.నవీన్ నికోలస్ | స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ |
భారతి లక్‌పతి నాయక్ | సమాచార శాఖ కమిషన్ కార్యదర్శి |
కిల్లు శివకుమార్ నాయుడు | R&R కమిషనర్ |
చిట్టెం లక్ష్మి | సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి |
సృజన | మహిళా-శిశు సంక్షేమ డైరెక్టర్ |
టీ. వినయ్ కృష్ణారెడ్డి | నిజామాబాద్ కలెక్టర్ |
ఎల్. శివశంకర్ | వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శి |
వీపీ గౌతమ్ | గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి |
కె. హైమావతి | సిద్ధిపేట కలెక్టర్ |
కె. నిఖిల | మత్స్యశాఖ డైరెక్టర్ |
వల్లూరి క్రాంతి | పర్యాటక శాఖ ఎండీ |
పీ. ఉదయ్ కుమార్ | ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ CEO |
ప్రియాంక ఆల | టీజీపీఎస్సీ కార్యదర్శి |
పి.ప్రావీణ్య | సంగారెడ్డి కలెక్టర్ |
వాసం వెంకటేశ్వర్‌రెడ్డి | ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్ |
మిక్కిలినేని మను చౌదరి | మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్ |
అనుదీప్ దురిశెట్టి | ఖమ్మం కలెక్టర్ |
స్నేహ శబరీష్ | హనుమకొండ కలెక్టర్ |
ముజామిల్ ఖాన్ | పౌర సరఫరాలశాఖ డైరెక్టర్ |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.