Prabhas Next Movie | శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అమరన్ (Amaran)మూవీ నిలిచిపోయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ నటనతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar periya Swami)పేరు మారు మోగిపోయింది. ఆ మూవీని అంత ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానానికి బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో చేయడానికి ముందుకు వస్తున్నారు.
డైరెక్టర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా తన నెక్స్ట్ మూవీ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ సూర్య,రజినీకాంత్ తో చేస్తున్నట్టు టాక్ వినబడ్డా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas )తో మూవీ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్.
ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ప్రభాస్ ను కలిసి స్టోరీ చెప్పారని,ఆ స్టోరీ ప్రభాస్ కు నచ్చి లాక్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. మారుతి(marathi)డైరెక్షన్ లో రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, హను రాఘవపూడి తో ఫౌజీ మూవీలతో బిజీగా ఉన్నారు.ఆ మధ్య రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ను మళ్లీ చూడబోతున్నామని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
డిసెంబర్ 5న రాజాసాబ్
డిసెంబర్ 5న ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కల్కి మూవీతో భారీ హిట్టు కొట్టిన ప్రభాస్ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. ఈ మూవీ సెకండ్ పార్టు కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో దీని చిత్రీకరణ ను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ అప్డేట్ కూడా ఇచ్చారు. హను రాఘవపూడి సినిమా ఫౌజీ కూడా కొత్త షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సలార్ 2 కూడా సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఆల్రెడీ స్పిరిట్ ను కూడా శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మూవీ..?
ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా రాజ్ కుమార్ పెరియసామి కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తే ప్రభాస్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో అర్థమవుతుంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్నట్టు కూడా ఓ వార్త వైరల్ అవుతోంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.