పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లు జారీ
Heavy Rains in Telangana : తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీగా వానలు కురుస్తున్నాయి.
ఈనెల 21న సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, మెదక్, భూపాలపల్లి, మహబూబాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈనెల 22న మంగళవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వానలు పడే చాన్స్ ఉందని పేర్కొంది.
ఇక ఈనెల 23న బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేటలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. .
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







