Sarkar Live

Tollywood updates : సెట్స్ పైకి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో సినిమా సెట్స్ పైకి

Tollywood updates : ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ కాంబో మొదలైంది. కొందరి కాంబినేషన్స్ సెట్ అయితే బాగుండని సినీ లవర్స్ కోరుకుంటారు.ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. అలాంటిదే త్రివిక్రమ్ వెంకటేష్ (Trivikram venkey combo) కాంబో. ఇంతకుముందు నువ్వు

Tollywood updates

Tollywood updates : ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ కాంబో మొదలైంది. కొందరి కాంబినేషన్స్ సెట్ అయితే బాగుండని సినీ లవర్స్ కోరుకుంటారు.ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. అలాంటిదే త్రివిక్రమ్ వెంకటేష్ (Trivikram venkey combo) కాంబో.

ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ (Nuvvu Naaku Nachav, Malleeshvaree) సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. ఆ సినిమాలలో వెంకటేష్ కామెడీ ఏ లెవెల్ లో ఉందో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ ఫిలిం గా నువ్వు నాకు నచ్చావ్ మూవీ అని చెప్పుకుంటారు. ఎప్పటి నుం డో వీరి కాంబోలో ఒక మూవీ రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. అనుకున్నట్టుగానే మూవీ పట్టాలకెక్కే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో టాక్ వినబడింది.

అట్లీ రాకతో లైన్ క్లియర్…

కానీ గురూజీ మాత్రం అల్లు అర్జున్ తో మూవీ సెట్ చేసుకున్నాడు. పుష్ప 2 (Pushpa 2)తో సంచలన విజయం అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ గురూజీ మూవీ పైనే ఫోకస్ పెట్టాడు. కానీ మధ్యలో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో మూవీ సెట్ చేసుకున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు.ఆ మధ్య మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అట్లీ అల్లు అర్జున్ (Atlee Allu combo) కాంబో మూవీ కంప్లీట్ అవ్వడానికి కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. వెంకీ కూడా ఈ యేడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్టు కొట్టాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఆ మూవీ నిలిచిపోయింది. ప్రజెంట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ లో వెంకీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇదేగాక దృశ్యం 3 కి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ మూవీ కొబ్బరికాయ కొట్టడానికి టైమ్ పట్టేలా ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

Tollywood updates హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై…

ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మూవీకి ఒకే చెప్పాడు. గురూజీకి కూడా గ్యాప్ దొరికింది కాబట్టి వెంకటేష్ తో మూవీ ప్లాన్ చేశాడు. ఆ స్టోరీ నచ్చడంతో వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు పూజాకార్యక్రమాలతో మొదలుపెట్టారు.వెంకీ 77 వ మూవీగా తెరకెక్కబోయే మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై (harika and haasini banner) చినబాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?