నందమూరి నటసింహం బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Nandamuri Balakrishna, Boyapati Sreenu)కాంబో హిస్టరీ ఏంటో అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటేనే మాస్ ఆడియన్స్ కి జాతర. బాలయ్య వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నప్పుడు బోయపాటి సింహా(simha) మూవీ తీసి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు. అక్కడి నుండి బాలయ్యకు అడపాదడపా ఒకటో రెండో ఫ్లాఫ్ లు వచ్చినా బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.
బోయపాటి శ్రీను కాంబో లో అఖండ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీరసింహ రెడ్డి, అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి, బాబీ తో డాకు మహరాజ్ ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. సీనియర్ హీరోలలో వరుసగా ఈ రేంజ్ ఓ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరోగా కూడా నిలుస్తున్నాడు. అనిల్ రావిపూడితో చేసిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ అయితే ఏకంగా ఉత్తమ తెలుగు మూవీగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
ఇక నెక్స్ట్ వచ్చే మూవీపై బాలయ్య ఫ్యాన్స్ లోనే కాదు సినీ లవర్స్ అందరికీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అఖండ తో బాలయ్య బోయపాటి బాక్సాఫీస్ పై ఎంతటి విధ్వంసం సృష్టించా రో మనకు తెలుసు. అప్పుడే మూవీకి సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు.
రెండు సినిమాలు ఒకటే రోజా…
కొన్ని నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లిన మూవీకి గుమ్మడికాయ కూడా కొట్టేశారు.సెప్టెంబర్ బరిలో నిలుస్తుందని టాక్ వినబడింది. ఆరోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ (Pawan Kalyan OG)రిలీజ్ అవబోతుంది. రెండు బడా సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతాయని అనుకున్నారు.కానీ ఈ రేస్ నుండి బాలయ్య మూవీ తప్పుకుందని టాలీవుడ్ లో గుసగుసలు వినబడ్డాయి.
Balakrishna Movie : సెప్టెంబర్ 25న బరిలో….
అయితే లేటెస్ట్ అప్డేట్ చూస్తే ఇంకా బరిలోనే ఉన్నారనే తెలుస్తోంది. అఖండ 2 (Akhanda 2)డబ్బింగ్ కంప్లీట్ అని బాలయ్య (Balakrishna) బోయపాటి పిక్ ని మూవీ టీం షేర్ చేసింది.దీంతో ముందు అనుకున్నట్టుగా సెప్టెంబర్ 25 న (September 25th)రిలీజ్ అవుతుందని మూవీ లవర్స్ అనుకుంటున్నారు. ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉండగా దాన్ని కూడా ఫినిష్ చేసి అధికారికంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలయ్య మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సింహా గర్జన ఖాయమని ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు.దీంతో ఈ ఇద్దరి కాంబో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







