ఇద్దరు యువకులు దుర్మరణం
Hyderabad News | హైదరాబాద్ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన విషాదకర ఘటన మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే తరహా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా కరెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా బండ్లగూడ వద్ద గణేష్ విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్రసారమైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని హాస్పిటల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా దగ్ధమవయ్యాయి. క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







