Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
ములుగును ముంచెత్తుతున్న ముసురు
- ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్ (ఆదిలాబాద్)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్)లో 11 సెం.మీ. వర్షం కురిసింది.
తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్, గుడిహత్నూరు, జంబుగ, సర్వాయిపేట, ధనోరా వంటి ప్రాంతాల్లో 7 నుంచి 10 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 18.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1, వెంకటాపురం (ములుగు)లో 12.1 సెం.మీ., జైనథ్ (ఆదిలాబాద్)లో 11.6, మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్)లో 11.3, సాత్నాల (ఆదిలాబాద్)లో 11, ములుగు జిల్లా తాడ్వాయిలో 10.4, కన్నాయిగూడెంలో 10.2, ధర్మవరంలో 10.2, మేడారంలో 10.2, ఆదిలాబాద్ జిల్లా సిరికొండ 9.7, రాంనగర్ 8.9, గుడిహత్నూరులో 8.9, జంబుగ (ఆసిఫాబాద్)లో 8.6 సెం.మీ., సర్వాయిపేట (భూపాలపల్లి) 8, ధనోరా (ఆసిఫాబాద్) 7.5, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 7.5, కెరమెరిలో 7.3, ఆదిలాబాద్ అర్బన్‌లో 7.1, బిక్నూర్ (కామారెడ్డి) 6.8, వాజేడు (ములుగు) 6.7, ఉట్నూరు (ఆదిలాబాద్) 6.5, సిర్పూర్ (టి) (ఆసిఫాబాద్) 6.4, ఇచ్చోడ 6.3, మెదక్ జిల్లా కాగజ్‌మద్దూరులో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







