Hyderabad News | తనకు మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి సీతక్క (Mnister Seethakka ) స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది గతసారి అనారోగ్యం.. సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు. మేము సమ్మక్క సారలమ్మ మాదిరిగా అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara 2026) పై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, వచ్చే సంవత్సరం సమ్మక్క సారక్క జాతర జనవరి 22 నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. . తాత్కాలిక పనులతో ఇప్పటివరకు జాతర పనులు జరిగాయని, ఈ సారి మాత్రం కొత్త ప్రణాళికలతో పనులు చేపట్టి జాతర రూపు రేఖలు మార్చుతామని మంత్రి స్పష్టం చేశారు.
జంపన్న వాగు, రోడ్ల విస్తరణ చేపడుతున్నాం. స్మృతి వనాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 12 వేల మంది పోలీస్ సిబ్బందితో జాతర బందోబస్తూ జరుగుతుంది. 13వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతామని మంత్రి సీతక్క చెప్పారు, పంచాయతీ రాజ్ శాఖ లో రేపటి నుంచి పనులు మొదలవుతునాయి. ఈసందర్భంగా పంచాయతీ రాజ్ శాఖలో లక్షా 15 వేల నిధులతో పనులు రేపటి నుంచి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసిందన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







