Boy dies after vaccination : వాక్సిన్ తీసుకున్నగంట వ్యవధిలోనే నాలుగు నెలల శిశువు మృతి చెందిన (boy dies) సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట (Jammikunta) మండలం పాపక్కపల్లిలో కలకలం రేపింది. టీకా ప్రభావమేనా లేక వేరే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ (vaccine) వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా వైద్యులు మాత్రం కారణం అది కాదని అంటున్నారు. ఇతర అనారోగ్య కారణం వల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చని వాదిస్తున్నారు.
పాపక్కపల్లి గ్రామానికి చెందిన లింగాల అంజి, హర్షిత దంపతులు తమ నాలుగు నెలల బిడ్డను వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం అక్కడి వైద్య సిబ్బంది RVV-2 (రోటా వైరస్ వ్యాక్సిన్), Penta-2 (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్-బి, Hib కలిపిన టీకా) వేశారు. ఈ టీకాలు సాధారణంగా శిశువులకు వేసే వ్యాక్సినే. టీకాలు వేసి ఇంటికి చేరుకున్న కొద్ది సమయానికే శిశువు ఒక్కసారిగా బలహీనంగా మారి మూర్ఛపోయాడు. తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పి హనుమకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందుతున్న సమయంలోనే ఆ శిశువు శ్వాస ఆగిపోయింది.
Boy dies after vaccination: తల్లిదండ్రుల ఆగ్రహం
తమ కొడుకు మృతికి కారణం వ్యాక్సినే కారణమని తల్లిదండ్రులు (parents) ఆరోపిస్తున్నారు. “మా బిడ్డకు ముందుగా ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. టీకా వేసిన తర్వాతే పరిస్థితి విషమించింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యురాలు డాక్టర్ వరుణను ఈ విషయమై నిలదీశారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొని ఉద్రిక్తత నెలకొంది.
వైద్యురాలి వివరణ
డాక్టర్ వరుణ ఈ ఆరోపణలను ఖండించారు. “టీకా సేఫ్‌గానే ఉంది. ఇదే బ్యాచ్‌లోని వ్యాక్సిన్‌ను మరికొంతమంది పిల్లలకు ఇచ్చాం. వారికి ఎలాంటి సమస్యలు రాలేదు. ఈ మృతికి వేరే అనారోగ్య కారణాలు కావచ్చు. కచ్చితమైన వివరాలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తాయి” అని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    