Pramod Nameendla
ప్రమోద్ నమిండ్ల డిజిటల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్లైన్ జర్నలిజం, న్యూస్ కవరేజ్, కంటెంట్ మేనేజ్మెంట్, SEO ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు.
ప్రస్తుతం Sarkar Live వెబ్సైట్లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి
మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
నటుడు విజయ్ పర్యటనలు వాయిదా
ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పర్యటనలు ప్రారంభించినప్పటికీ, తొక్కిసలాట ఘటన కారణంగా తాత్కాలిక విరామం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
కాగా ఈ ఘటనపై రాజకీయ విమర్శలు, వాదోపవాదాలు తీవ్రతరం అవుతున్నాయి. విజయ్ అధికార డీఎంకేపై ఆరోపణలు చేస్తుండగా, డీఎంకే కూడా విజయ్‌పై కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ తొక్కిసలాట (Karur stampede)లో ఇప్పటి వరకు 41 మంది మృతులుగా ధృవీకరించారు. వారిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 39 మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Pramod Nameendla
More Posts
“ఆటే నా పొగరు”.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ టీజర్ టాక్: బాక్సాఫీస్ వద్ద వేట మొదలు! – Peddi Movie Teaser Review
Read More »పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. సామాన్యుడికి, చమురు సంస్థలకు పండగే! – Petrol Diesel Excise Duty Cut
Read More »హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News
Read More »పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage
Read More »ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ
Read More »సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
Read More »ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
Read More »ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్
Read More »“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!
Read More »Web Stories
Gallery
Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!
Ivana | టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ
Rajma | కిడ్నీ బీన్స్ ఎవరు తినకూడదు?
Recent Posts