Sarkar Live

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న

Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌ను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించారు.

కొత్త సంస్క‌ర‌ణ‌లు ఇవీ..

  • ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేశారు.
  • ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫోటోలు ఉంచడం.
  • మహిళా ఓటర్ల పాల్గొనడం పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం.
  • వృద్ధులు, దివ్యాంగుల కోసం సౌకర్యాలు.. వీల్‌చెయిర్లు, ర్యాంపులు, పిక్-అప్/డ్రాప్‌ సదుపాయాల క‌ల్ప‌న‌. రియల్‌టైమ్‌ ఓటింగ్‌ టర్నౌట్‌ మానిటరింగ్‌ కోసం డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు, మొబైల్‌ యాప్‌ల వినియోగం. సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్‌ ట్రాకింగ్

కాగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఇందుకోసం టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ ఉంటుందని ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి తెలిపారు. పర్యావరణహిత ఎన్నికలు — పేపర్‌ వినియోగం తగ్గించడం, డిజిటల్‌ సమాచార మార్పిడిని ప్రోత్స‌హిస్తామ‌న్నారు. కాగా సీఈవో సుధర్షన్‌రెడ్డి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో ఏర్పాట్లను సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?