Telangana : సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుశ్మిత (Konda Sushmitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని వదిలేయండని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు. దిల్లీలో ఖర్గేతో సమావేశంలో మా అమ్మను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) తిడితే ఆరోజు మా అమ్మ ఎంతో ఏడ్చిందని సుష్మిత తెలిపారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సోదరులు మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం దేవాదాయశాఖ భూమిని అడిగారు.. దీనిప ప్రశ్నిస్తే దానికి బదులుగా పక్కన ప్రైవేట్ భూమి ఇస్తామని అన్నారు. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్‌ను రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని సుస్మిత పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎంతో కొండా సురేఖ, సుష్మిత భేటీ
కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుశ్మిత భేటీ అయ్యారు. బుధవారం రాత్రి జరిగిన విషయాలను డిప్యూటీ సీఎంకు సురేఖ వివరించారు.
Hyderabad | Daughter of Telangana Minister Konda Surekha, Konda Sushmitha, has alleged that her mother is being targeted by the state government.
She says, "I am still on what I said yesterday…." pic.twitter.com/oYJpYAoxsT
— ANI (@ANI) October 16, 2025
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    