Sarkar Live

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ

Insurance

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
ఈ మేర‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది.

మ‌రోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, రోడ్డు భ‌వ‌నాల శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల‌ మేరకు విడుదల అధికారులు చేశారు. రోడ్లు- భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?