- పౌర సరఫరాల శాఖ కు 30 కి పైగా ఏసికెలు పెండింగ్
- ధాన్యం కేటాయింపులు లేకుండానే ధాన్యం దిగుమతి
Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు?
హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే సదరు మిల్లు యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా సుమారు రూ 3 కోట్ల విలువైన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ కు పంపించాలి. కానీ సదరు మిల్లులో 30 ఏసికెలకు సరిపడా ధాన్యం లేకపోవడం గమనార్హం. అసలు మిల్లులో ఉండాల్సిన ధాన్యం ఎటుపోయినట్లు అనేది మిల్లు యాజమాన్యానికే తెలియాలి
అలాట్మెంట్ లేకున్నా ధాన్యం దింపుకుంటున్నారు?
వెంకటేశ్వర రైస్ మిల్లు కు” ప్రస్తుత ఖరీఫ్ సీజన్” కు సంబంధించి పౌరసరఫరాల శాఖ ఎలాంటి కేటాయింపులు(అలాట్మెంట్)చేయనప్పటికి సదరు మిల్లర్ పౌరసరఫరాల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇదే విషయమై (మిల్లులోధాన్యం లేకపోవడం నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం దింపుకోవడం ) సివిల్ సప్లై “డిటి “వేణుగోపాల్ ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని రికార్డులు పరిశీలించి చెప్తానని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







