Jubilee Hills ByElection Results Congress Victory | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన 24,658 ఓట్ల మెజార్టీ సాధించి జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు.
పోస్టల్ బ్యాలెట్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రారంభమై కౌంటింగ్ మొత్తం ముగిసే వరకు కొనసాగింది. ఏ ఒక్క దశలో కూడా ప్రత్యర్థులు నవీన్ యాదవ్‌ను అందుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు పడ్డాయి. చివరికి నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ముందంజలో నిలిచి, తన ప్రత్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాధించిన 74,259 ఓట్లపై భారీ ఆధిక్యం నెలకొల్పారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
డివిజన్‌వారీగా కూడా కాంగ్రెస్‌దే ఆధిపత్యం
జూబ్లీహిల్స్ పరిధిలోని మొత్తం 7 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీగానే ఆధిపత్యం చలాయించింది. షేక్‌పేట్ డివిజన్‌లో కొంత పోటీ కనిపించినప్పటికీ, మిగిలిన అన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో చివరికి 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








