Sarkar Live

Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!

Bihar Election Results : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (The National Democratic Alliance (NDA) విజ‌యం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 243

Bihar Election Results

Bihar Election Results : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (The National Democratic Alliance (NDA) విజ‌యం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో 204 స్థానాల్లో NDA ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో NDA పున‌ర్‌వైభ‌వం దిశ‌గా న‌డుస్తోంద‌ని తెలుస్తోంది.

నితీష్ కుమార్ (Nitish Kumar) మ‌రోసారి సీఎం (Chief Minister) కానున్నారనే సంకేతాలు అందుతున్నాయి. వ‌రుస‌గా ఐదోసారి ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌బోతున్నారని బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు (Bihar Election Results) చెబుతున్నాయి. బిహార్‌లో ఇప్పటి వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నితీష్ రికార్డు సృష్టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

Bihar Election Results : 2020 ఎన్నిక‌ల‌ కంటే మెరుగైన ఫ‌లితాలు

సాయంత్రం 6 గంటల సమయానికి వచ్చిన ట్రెండ్స్ ప్రకారం 2020 ఎన్నికల్లో సాధించిన 122 స్థానాల మార్కును NDA దాటేసింది. ఈసారి 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండ‌టాన్ని ప‌రిశీలిస్తే ఆ కూట‌మి మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని తెలుస్తోంది. మహాగఠ్బంధన్ (Mahagathbandhan) విషయంలో పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు. 33 స్థానాల్లో మాత్ర‌మే ఆ కూట‌మి ఆధిక్యంలో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన స్వరాజ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెర‌వ‌క‌పోయింది.

ప్రధాన అభ్యర్థుల పరిస్థితి

రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకుడైన తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన RJD పార్టీకి కీలక నేతగా ఈ ఎన్నికల్లో ప్రాధాన్యతనందిస్తున్నారు.
ఇతర ప్రధాన అభ్యర్థుల విషయానికి వస్తే– డెప్యూటీ ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌద‌రి, విజయ్ కుమార్ సిన్హా, జనశక్తి జనతా దళ్ (JJD) నేత తేజ్ ప్రతాప్, బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ కుమార్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

మ‌హాగ‌ఠ్బంధ‌న్ అంచ‌నాలు తారుమారు

బిహార్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. NDA ఘన విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్‌లోనే అంచనాలు వచ్చాయి. JD(U) కూడా NDA భాగమే కావడంతో ఈ ఫలితాలు ఆ కూటమికి భారీ ఊతమిచ్చాయి. తేజస్వీ యాదవ్ (Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav) మాత్రం ఈ అంచనాలను పెద్దగా పట్టించుకోలేదు. “మహాగఠ్బంధ‌న్ (Mahagathbandhan) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, భారీ మెజారిటీతో వస్తాం” అని ధీమాగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం వచ్చిన ఫ‌లితాలు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి.

రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం

నవంబరు 6 , 11 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదు కావడం చారిత్ర‌క విషయం. బిహార్ ప్రజలు చైత‌న్య‌వంతులు అన‌డానికి ఇదే సంకేత‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న యువ‌ అభ్యర్థులు

ఈ ఎన్నికల్లో జనరేషన్ Z వర్గానికి చెందిన దాదాపు 10 మంది యువ అభ్యర్థులు పోటీ చేశారు. ఆధ్యాత్మిక గాయనిగా ప్రసిద్ధి పొందిన మైథిలీ ఠాకూర్ వారిలో ఒక‌రు. అలీనగర్ నుంచి BJP తరఫున ఆమె పోటీ చేశారు. అత్యంత పిన్న వయస్కురాలు MLAగా ఆమె రికార్డు ఎక్క‌బోతున్నారు. RJD అభ్యర్థి బినోద్ మిశ్రా పై 7,000 ఓట్ల ఆధిక్యంలో మైథిలీ కొన‌సాగుతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే, బీహార్ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని అత్యంత పిన్న వయస్కురాలు MLAగా నిలిచే అవకాశం ఉంది. అలాగే RLJP పార్టీకి చెందిన యశ్ రాజ్ అలోలి నుంచి పోటీ చేశారు. JD(U) అభ్యర్థి రామ్ చంద్ర సాదా చేతిలో ఆయ‌న ఓడిపోయారు. అమౌర్ నియోజకవర్గంలో AAP అభ్యర్థి ముంతాజిర్ ఆలమ్ ఇప్పటి వరకు 2,300 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ స్థానంలో AIMIM నేత అఖ్తరుల్ ఇమాన్ ఒక లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
ఔరంగాబాద్‌ నుంచి స్వతంత్రంగా పోటీ చేసిన నేహా కేవలం 200 ఓట్లతో చాలా వెనుకబడి ఉన్నారు. BJP అభ్యర్థి త్రివిక్రమ్ సింగ్ భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?