Sarkar Live

హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల

Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల ప్రోత్సాహం, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలపై కేబినెట్‌స‌మావేశంలో విస్తృత చర్చలు జరిగాయి.

  1. 27 మున్సిపాలిటీలను GHMC లో విలీనం : ఔటర్ రింగ్ రోడ్ లోపల–బయట ఉన్న, ORR ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను GHMCలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన GHMC Act, Telangana Municipal Act సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. రాజ‌ధాని నగర విస్తరణ, పునరాభివృద్ధిని క్రమబద్ధీకరించనుంది.
  2. రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు : ప్రస్తుతం ఉన్న NPDCL, SPDCL‌లతో పాటు, వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, HMWSSB పవర్ కనెక్షన్లను నిర్వహించేందుకు మూడో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
  1. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 3000 MW సోలార్ పవర్ కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు. త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. 5 సంవత్సరాల పీరియడ్ PPAతో ఒప్పందాలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెర‌గ‌నుంది.
  2. 2000 MW Pumped Storage Power కొనుగోలు
    పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు కోసం 2000 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు, 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు కంపెనీలకు అనుమతి ఇవ్వ‌నున్నారు. అవసరమైన భూమి, నీటి వనరులను ప్రభుత్వం అందించనుంది ఉత్పత్తి చేసే విద్యుత్తు ముందుగా రాష్ట్ర డిస్కమ్‌లకే విక్రయించాలనే షరతు విధించింది.
  3. కొత్త పరిశ్రమలకు స్వంత విద్యుత్ ఉత్పత్తికి అనుమతి
    పరిశ్రమలకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద: కొత్త పరిశ్రమలు తమ అవసరానికి తామే విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి అప్లై చేస్తే వెంటనే ఆమోదం తెలుపనున్నారు. . ఉత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి పరిమితి లేదు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ప్రస్తుత విధానంలోనే పవర్ సప్లై కొనసాగుతుంది.
  4. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో NTPC ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లు
    రామగుండం థర్మల్ స్టేషన్లో 800 MW యూనిట్ నిర్మాణాన్ని NTPC కు అప్పగించేందుకు పరిశీలించ‌నుంది.
    పాల్వంచ, మక్తల్‌లో కూడా NTPC ఆధ్వర్యంలో యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించింది.
  5. హైదరాబాద్‌లో Under-Ground Electric Cable Network : బెంగళూరు మాదిరిగా GHMC పరిధిలో విద్యుత్ కేబుల్‌లను పూర్తిగా అండర్‌గ్రౌండ్‌ సిస్టమ్‌గా మార్చే ప్రాజెక్ట్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం ₹14,725 కోట్లు సిటీని 3 సర్కిళ్లుగా విభజించి దశలవారీగా అమలు చేయ‌నున్నారు. విద్యుత్తు, టీ ఫైబర్, ఇతర కేబుల్ నెట్‌వర్క్ లైన్లు కూడా అండర్‌గ్రౌండ్‌లో ఉంటాయి.

8–10. విద్య, క్రీడలు, టెక్నాలజీ అభివృద్ధికి భూముల కేటాయింపు
దుమ్ముగూడెం – యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు 20.28 ఎకరాలు. ములుగు – స్పోర్ట్స్ స్కూల్‌కు 40 ఎకరాలు కేటాయించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. జూబ్లీహిల్స్ – కొత్త Advanced Technology Centre స్థాపన ఇప్పటికే ఉన్న 56 ATCs‌తో పాటు మరో 6 ITIs లో కొత్త ATCs ఏర్పాటు చేస్తారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?