Sarkar Live

Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా

Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే

Cyclone Dhitwa

Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఉత్తర తెలంగాణలో చలి పంజా!

దిత్వా తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ గణనీయంగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30వ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి 9 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది.
రాష్ట్ర‌ రాజధాని హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Cyclone Dhitwa : డిసెంబర్‌లో వర్షాల ప్రభావం

తుఫాను కారణంగా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తుఫాను ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది.
ఖమ్మం, మానుకోట‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, పాల‌మూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?