Sarkar Live

Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13

Food Poisoning

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు.

పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం!

ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అంతేకాకుండా, మెనూ సక్రమంగా పాటించడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వం తీరుపై విమర్శలు

రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా, అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆరోపించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?