Sarkar Live

హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ

హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్

ORR

హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయ‌డం, ఒక లేన్ నుంచి మ‌రో దానికి మారిన‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డం తదిత‌ర కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్య‌కృత్య‌మ‌య్యాయి. వాహ‌న‌దారుల ఈ ధోర‌ణి వ‌ల్ల అనేక ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్టేందుకు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్ర‌త్యేక చ‌ర్యల‌కు శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ స‌హ‌కారంతో ఓ బృహ‌త్త‌ర కార్యానికి ముంద‌డుగు వేశారు.

హైస్పీడ్ వ‌ల్లే నిత్యం యాక్సిడెంట్లు

ఔట‌ర్ రింగ్ రోడ్ (ORR)పై ప్ర‌మాదాలు నిత్య‌కృత్యం కావ‌డానికి వాహ‌నాల అతివేగ‌మే కార‌ణ‌మ‌ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. వాహ‌న‌దారులు అత్య‌ధికుల్లో 60–70 కి.మీ.ల వేగానికి మించి వెళ్లేవారు ఉన్నార‌ని గుర్తించారు.
ప్రత్యేకించి రాత్రి సమయంలో ఈ మార్గం కొంత ఖాళీగా ఉండటం వల్ల యువకులు అదుపు తప్పేలా స్పీడ్ పెంచుతారని, అదే సమయంలో రాంగ్‌సైడ్‌లో వాహనాలు ఆపడం కూడా ప్రమాదాలకు దారి తీస్తోంద‌ని తేల్చారు.

ఏఐ సర్వైలెన్స్ విధానంతో చెక్‌

ఆర్‌వోఆర్‌పై ప్రమాదాలను తగ్గించాలంటే సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక టెక్నాలజీ కూడా అవసరమని పోలీసు అధికారులు భావించారు. దీంతో 24 గంటల పాటు నిఘా ఉంచేలా ఏఐ ఆధారిత కెమెరాలను ORR పై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాన‌వ జోక్యం లేకుండానే ఇవి ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తాయి. వాహనం వేగం, లేన్ మార్చడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, హెల్మెట్/సీటుబెల్ట్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించి డేటాను పోలీసులకు పంపిస్తాయి.

14 ప్రాంతాల్లో మల్టీ వైలేషన్ డిటెక్షన్ సిస్టమ్స్‌

సైబరాబాద్ పోలీసులు, హెచ్‌జీసీఎల్ (HGCL surveillance) అధికారులు క‌లిసి మొత్తం 14 కీలక పాయింట్లను గుర్తించారు. ఇవి ప్రమాదాలు ఎక్కువ‌గా జ‌రిగే ప్ర‌దేశాలు. అక్కడ మల్టీ వైలేషన్ డిటెక్షన్ సిస్టమ్ (Multi Violation Detection System-MVDS)‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒకేసారి పలు ర‌కాల ఉల్లంఘనలను రికార్డు చేయొచ్చు. అతివేగం, రాంగ్ సైడ్‌ డ్రైవింగ్, ఓవర్‌టేకింగ్‌ తప్పుగా చేయడం, లేన్‌ మార్చడం, పార్కింగ్‌ నియమాల ఉల్లంఘన, నిబంధనలు పాటించని బైకర్లు, సన్‌ఫిల్మ్ లేదా నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘన లాంటివి ఈ సిస్టం గుర్తిస్తుంది. వాహన నంబర్ ప్లేటును కూడా స్పష్టంగా క‌నిపించేలా ఉల్లంఘ‌న‌ల దృశ్యాల‌ను క్యాప్చర్ చేస్తుంది. వెంటనే ట్రాఫిక్‌ కంట్రోల్ రూమ్‌కు డేటాను చేర‌వేస్తుంది. తద్వారా సంబంధిత వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్ పంపుతారు.

24 గంటలపాటు నిరంత‌ర‌ నిఘా

ఇప్పటి వరకు పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ కోసం ఒకేచోట నిలబడి స్పీడ్ గన్స్‌తో తనిఖీలు చేసేవారు. అయితే.. ORR లాంటి మార్గంలో ఇది చాలద‌ని గుర్తించారు. 24 గంటలపాటు నిఘా ఉంటేనే నిరంత‌ర నిఘా సాధ్య‌మ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ–సర్వైలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాత్రీ ప‌గ‌లు అని తేడా లేకుండా నిరంతరంగా పనిచేస్తుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?