Sarkar Live

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections

Gram panchayat elections – Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ

Gram panchayat elections

Gram panchayat elections – Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ హింసాత్మ‌క సంఘ‌ట‌న (violent clash) జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

చిన్న‌పాటి గొడ‌వ మొద‌లై..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంప‌ల్లిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు (Gram panchayat elections) తొలి విడ‌త (డిసెంబ‌రు 11) జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న‌పాటి గొడ‌వ‌గా మొద‌లై మాటామాట పెరిగి ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. సుమారు 70 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యక‌ర్త‌లు, అభిమానులు ప‌ర‌స్ప‌రంగా దాడుల‌కు దిగారు.

ఒక‌రి మృతి.. 16 మందికి గాయాలు

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌లు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టుకున్నారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఉప్పుల మ‌ల్ల‌య్య తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే వైద్యం కోసం త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే అత‌డు ప్రాణాలు వ‌దిలాడు. అదే విధంగా ఈ దాడిలో బీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు మున్నా మ‌ల్ల‌య్య యాద‌వ్‌తోపాటు సుమారు 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని సూర్య‌పేట‌, న‌ల్ల‌గొండ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఉద్రిక్త‌ల కేంద్రంగా లింగంప‌ల్లి

లింగ‌ప‌ల్లి రాజ‌కీయంగా ఉద్రిక్తతలకు ఇప్ప‌టికే కేంద్రమైంది. గత ఏడాది ఇక్కడ మాజీ సర్పంచ్ హత్యకేసు నమోదు కావడంతో గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా సూర్య‌పేట‌ ఎస్పీ నరసింహ (Suryapet SP Narasimha) ఇప్పటికే పోలీసులను అప్ర‌మ‌త్తం చేశారు. అయినప్పటికీ పోలింగ్ (polling)కు కొద్ది గంటల ముందు ఇలాంటి దాడి జరగడాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. భారీగా పోలీసు బ‌ల‌గాలను మోహ‌రించారు. లింగంప‌ల్లితోపాటు సూర్యాపేట, ఆత్మకూర్, నూతన్‌కల్, మద్దిరాల‌, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో బందోబ‌స్తును మ‌రింత ప‌టిష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?