Hyderabad Nepali Gang Theft | హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో ఓ నేపాలి గ్యాంగ్ హల్చల్ చేసింది. వ్యాపారి (Businessman) ఇంట్లోంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు అపహరించి ఉడాయించింది. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి పనులు చూసుకోవడంతోపాటు సెక్యూరిటీగా ఉన్న దంపతులే (Couple of Nepalis) మరికొందరితో కలిసి ఆ చోరీకి పాల్పడ్డారు.
ఇంటి మనుషుల్లా చూసుకున్నా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలో నివసించే వ్యపారి ఇంటి పనుల (Domestic work) నిమిత్తం కొంతకాలం క్రితం నేపాలి దంపతుల (Couple of Nepalis)ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉంటూ ఇంటి పనులు చూసుకొనే ఈ భార్యాభర్తలు కొన్ని రోజుల్లోనే యజమానిని ప్రసన్నం చేసుకున్నారు. ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చిన ఆ నేపాలి దంపతులను యజమాని కుటుంబం తన ఇంటి మనుషుల్లా చూసుకొనేది.
నేపాలి దంపతులను నమ్మిన వ్యాపారి కుటుంబం వారిని ఇంట్లో ఉంచి ఇటీవల ఊరికెళ్లింది. ఇదే అదునుగా భావించిన నేపాలి దంపతులు బయట వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సహచరుల (Couple of Nepalis)తో కలిసి పెద్ద ప్లాన్ వేశారు. వారందరినీ రప్పించి యజమాని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను మూటగట్టుకొని ఉడాయించారు. పెద్ద మొత్తంలో అల్మారాల్లో పెట్టిన నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గాడ్జెట్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించి పారిపోయారు.
షాక్ తిన్న ఇంటి యజమాని
తిరిగి వచ్చిన యజమాని ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తెరచి ఉండగా అందులో భారీ మొత్తంలో ఉన్న నగదు, బంగారు నగలు కనిపించలేదు. అలాగే ఇతర విలువైన వస్తువులు కూడా చోరీకి గురైనట్టు గుర్తించాడు. దీంతో యజమాని, ఆయన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. దొంగతనం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇంటి లోపల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా.. ఉంటే అవి పనిచేశాయా? అనేది కూడా పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న కెమెరాల ఫుటేజీని కూడా సేకరించి, దొంగలు వెళ్లిన దారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
గాలిస్తున్న పోలీసులు
ఈ దొంగతనానికి అదే ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు (Couple of Nepalis) తమ సహచరులతో కలిసి చేసినట్టు పోలీసులు (local police) గుర్తించారు. ఉద్యోగం పేరుతో ఇంట్లో ఉండే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంట్లో ఎవరు ఎప్పుడుంటారు.. ఎప్పుడుంరు? డబ్బు ఎక్కడ దాచి పెడతారు.. రక్షణ ఏర్పాట్లు ఏమున్నాయి? అనే విషయాలను గమనించిన నేపాలి దంపతులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు, వారి ఫోన్ లొకేషన్లు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాత్రికి రాత్రే ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకెళ్లడం చూస్త ఈ ఘటన ఒక్కరోజులో జరగలేదని, ముందుగానే పక్కా ప్లాన్ వేసుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపాలి గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వద్ద నిఘా పెంచారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







