Sarkar Live

Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త

Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన‌ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్‌ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన

Indiramma Indlu
  • 10 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల కోసం జీవో
  • వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల ప్రకటన!

Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన‌ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్‌ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన ఫోన్ ద్వారా ప్రసంగిస్తూ జర్నలిస్టులకు పలు కీలక హామీలు ఇచ్చారు.

అక్రిడిటేషన్ కార్డులపై 10 రోజుల్లో జీవో

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లోతుగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇతర న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైందని ఆయన వివరించారు. వాటన్నింటినీ అధిగమించి, వచ్చే ఏడాది (2026) జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అందుతుందని ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమం మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని పొంగులేటి ఉద్ఘాటించారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులను, సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని మంత్రి ప్రకటనల పట్ల హర్షం వ్యక్తం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?