కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్ బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








