Telangana Budget 2026-27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’ అనే నినాదంతో సామాన్యుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది.
బడ్జెట్ స్వరూపం
- మొత్తం బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు
- రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు
- మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు
- కొత్త రుణాలు: రూ. 73,383 కోట్లు (ప్రతిపాదిత)
Telangana Budget 2026-27 : ప్రధాన ఆకర్షణలు & పథకాలు
1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేలా రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ పథకానికి రూ. 4,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం జూన్ 2 నుంచి అమలులోకి రానుంది. .
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
విద్యారంగానికి ఏకంగా రూ. 26,674 కోట్లు కేటాయించారు. యంగ్ ఇండియా స్కూల్స్: అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల పాఠశాలల నిర్మాణం కోసం రూ. 5,000 కోట్లు.
విద్యార్థులకు భరోసా: ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం. ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ. 2,000 స్టైఫండ్.
- ఓయూ అభివృద్ధి: ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకంగా రూ. 1,000 కోట్లు.
3. ఆరు గ్యారెంటీలకు భారీ నిధులు (రూ. 50,713 కోట్లు)
ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటుతూ భారీగా నిధులు కేటాయించింది:
- మహాలక్ష్మి పథకం: రూ. 4,305 కోట్లు (ఉచిత బస్సు ప్రయాణం).
- గ్యాస్ సబ్సిడీ (రూ. 500 కే సిలిండర్): రూ. 723 కోట్లు.
- గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్): రూ. 2,080 కోట్లు.
- చేయూత (పెన్షన్లు): రూ. 14,861 కోట్లు.
- ఇందిరమ్మ ఇళ్లు: రూ. 5,500 కోట్లు.
| శాఖ / రంగం | కేటాయించిన నిధులు (కోట్లలో) |
| వ్యవసాయ శాఖ | రూ. 23,179 |
| విద్యా శాఖ | రూ. 26,674 |
| విద్యుత్ శాఖ | రూ. 21,285 |
| వైద్య & ఆరోగ్య శాఖ | రూ. 13,679 |
| బీసీ సంక్షేమం | రూ. 12,511 |
| ఎస్సీ సంక్షేమం | రూ. 11,784 |
| రైతు భరోసా | రూ. 18,000 |
| మూసీ రివర్ ఫ్రంట్ | రూ. 1,500 |
కీలక నిర్ణయాలు
సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు రూ. 3,500 కోట్లు. : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
నగర అభివృద్ధి కోసం మెట్రో రైలు ఫేజ్-2 పనులకు రూ. 600 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా అంబేడ్కర్ అడుగుజాడల్లో ఈ బడ్జెట్ రూపొందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








