న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు చెన్న లక్ష్మీనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
చెన్న లక్ష్మీనారాయణ మృతి పట్ల జర్నలిస్టు లోకం, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామకృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ అంత్యక్రియలు నేడు హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం, పత్తిపాక గ్రామంలోని వారి స్వగృహం వద్ద నిర్వహించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సన్నిహితులు, బంధువులు పత్తిపాకకు చేరుకుంటున్నారు.








