Sarkar Live

రాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం: 250 మందికి పరీక్షలు

హన్మకొండ ములుగు రోడ్డులోని రియా హాస్పిటల్ మరియు రాంపూర్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాంపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా సర్పంచ్ రడం భరత్ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.​ఈ

హన్మకొండ ములుగు రోడ్డులోని రియా హాస్పిటల్ మరియు రాంపూర్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాంపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా సర్పంచ్ రడం భరత్ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.​ఈ శిబిరంలో రియా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు:

డాక్టర్ వుప్పల రవీందర్ (MD, జనరల్ ఫిజీషియన్)

డాక్టర్ గన్ను కృష్ణమూర్తి (MS, ఆర్థో – ఎముకల నిపుణులు)

డాక్టర్ హర్షవర్ధన్

డాక్టర్ నర్సింహ స్వామి (గీసుగొండ)

​ముఖ్య విశేషాలు:

​గ్రామంలోని సుమారు 250 మంది రోగులకు ఉచితంగా OP (అవుట్ పేషెంట్) సేవలు అందించారు.వచ్చిన వారందరికీ రక్త పరీక్షలు మరియు షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించారు.​కీళ్ల నొప్పులు, బిపి, షుగర్ మరియు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ రడం భరత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తన విజ్ఞప్తిని మన్నించి ఉచిత శిబిరం నిర్వహించిన రియా హాస్పిటల్ యాజమాన్యానికి మరియు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, హాస్పిటల్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?