Mazaka movie review | మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?
Mazaka movie review | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రీతు వర్మ (Reethu Varma) హీరో హీరోయిన్లుగా మన్మధుడు ఫేమ్ అన్షు(Aanshu), రావు రమేష్ (Raavu Ramesh) ముఖ్యమైన పాత్రల్లో ధమాకా హిట్టు తర్వాత త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao nakkina) డైరెక్షన్ లో వచ్చిన మూవీ మజాకా (Mazaka). ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటీనటులు ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు. ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పించిం దనేది చూద్దాం….
మూవీ కథ విషయానికి వస్తె తండ్రి రమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ కి (సందీప్ కిషన్) సంబంధాలు చూస్తుంటాడు. కృష్ణ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఎవరూ కూడా పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రమణ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకావిడ (అన్షు) పరిచయమవుతుంది. ఇక్కడ కృష్ణ కూడా ఒక అమ్మాయిని(రీతు వర్మ)లవ్ చేస్తాడు.ఇద్దరు ఒకేసారి ప్రేమ...




