Adani’s indictment | అదానీ లంచం కేసులో మరో ట్విస్ట్.. అదేమిటంటే..
Adani's indictment : భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే ఆరోపణలు మళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌరశక్తి ఒప్పందాల కోసం భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్టజెప్పిందని, వాటి చెల్లింపులు అమెరికా పెట్టబడిదారుల నుంచి జరగాయని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. అమెరికా అటార్నీ జనరల్ (Attorney General)గా బాధ్యతలు స్వీకరించిన పామెలా బేడీకి అక్కడి కాంగ్రెస్ సభ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.
ఏదైనా కుట్ర కోణం ఉందా?
భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...




