BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వరలో జీవో
BC Reservations : తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations ) కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. కొత్తగా జీవో జారీ (government order (GO) చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయని అధికార వర్గాలు ధృవీకరించాయి.
జిల్లా స్థాయిలో ఏర్పాట్లు పూర్తి
జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలనే కసరత్తును పూర్తి చేశారు. మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (MPTCs), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (ZPTCs), మండల ప్రెసిడెంట్ (MPPs), సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల వరక...




