Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి
Hyderabad

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam
Special Stories

నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam

"బదిలీతో తహశీల్దార్ తప్పించుకున్నట్లేనా?” బరితెగించిన నిర్ణయాలు.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బదిలీపై వెళ్లిన తహశీల్దార్ లేఅవుట్ అనుమతులు లేకుండానే హుజురాబాద్ లో వందలాది ప్లాట్లకు కన్వర్షన్ Huzurabad NALA Conversion Scam | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లకు అధికార ముద్ర పడిందా? వందలాది ప్లాట్లకు లేఅవుట్ అనుమతులు లేకుండానే నాన్-అగ్రికల్చర్ (ఎన్‌ఏ) కన్వర్షన్‌లు ఎలా జరిగాయి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ అనుమతులు లేకుండానే కన్వర్షన్‌లు? స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ అనుమతులు పొందకుండా అభివృద్ధి చేసిన పలు అక్రమ లేఅవుట్లలో వందలాది ప్లాట్లు విక్రయించబడ్డాయి. వ్యవసాయ భూముల్లోని అవే ప్లాట్లకు గజాల వారిగా కన...
వరంగల్‌ కమిషనరేట్ లో హోలీ సంబరాలు
Crime

వరంగల్‌ కమిషనరేట్ లో హోలీ సంబరాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate )కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు అధికారులు, సిబ్బంది రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్‌లతో సందడి చేశారు. హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని , అందరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident
Mahaboobnagar, Crime

జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. Jadcherla Hospital : అసలేం జరిగింది? జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధ...
తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
error: Content is protected !!