Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కోట్లకు పడగలెత్తిన సర్వేయర్
Special Stories

కోట్లకు పడగలెత్తిన సర్వేయర్

​టెక్స్‌టైల్ పార్క్ కేంద్రంగా కోట్ల దందా.. ప్రభుత్వ సర్వేయర్ ‘గాలి’ వేగం! సదా.. ఆనందంగా అక్రమాల పర్వం రియల్టర్ అవతారమెత్తిన ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీ నజర్ వేస్తే విస్తుపోయే అక్రమాస్తులు వెలుగులోకి ​Warangal Textile Park Surveyor Scam | అతను ఒక ప్రభుత్వ సర్వేయర్. భూముల హద్దులు నిర్ణయించడమే అతని విధి. కానీ, ఆ హద్దులు దాటి అక్రమ సంపాదనలో ‘కోట్లకు పడగలెత్తాడు’. ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో రియల్టర్ అవతారమెత్తి, సామాన్యుల భూములతో చెలగాటమాడుతూ అపర కుబేరుడిగా అవతరించాడు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ 'రియల్' సర్వేయర్ లీలలు హాట్ టాపిక్‌గా మారాయి. ​టెక్స్‌టైల్ పార్క్.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్! ​మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును ఆసరాగా చేసుకున్న ఈ సర్వేయర్, అక్కడ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని 'గాలి'లా విస్తరించాడు. ప్రభుత్వ సమాచారం ముందే తెలుసుకుంటూ, అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ భూదంద...
​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
National

​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.సువేందు అధికారి పేరును బీజేపీ నేత భట్టాచార్య ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.పరిపాలనలో సమతుల్యత కోసం ఇద్దరికి డిప్యూటి సీఎం పదవులు దక్కనున్నాయి.అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన భేటీలో సువేందు అధికారిని బెంగాల్ సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల నియామకంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది....
సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!
Special Stories

సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ ‘పెద్ద సారు’ పుణ్యమా అని దర్జాగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ​ఎర్రమంజిల్ నుంచే అసలు కథ! ​ఈ వ్యవహారానికి ప్రధాన కేంద్రం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం. అక్కడ కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారికి సదరు ఉద్యోగికి అత్యంత సన్నిహిత బంధువు కావడమే ఇందుకు కారణం. ఆ బంధుత్వమే ఇప్పుడు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేసింది. తను కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో చక్రం తిప్పేందుకు ఎర్రమంజిల్ నుంచే పావులు కదిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​నోరు మెదపని జిల్లా మేనేజర్ (DM) ​నిజానికి అర్హత లేని వ్యక్తి కీలక స్థ...
తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..
Hyderabad

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ - బస్వరాజ్ శ్రీనివాస్ ​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ - దాసరిరాజు అజయ్ కుమార్ ​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ - ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్ ​మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ - దొంగరి వెంకటేశ్వర్లు ​మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ - సంగ వెంకట్రాజం ​వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ - గట్టు తిమ్మప్ప ​మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ - బొమ్మ శ్రీరామ్ ​యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ - ఎం. రఘునాథ్ యాదవ్ ​వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ - కుంట రేణుక నారాయణ ​చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ - గూడెం వెంకటరమణ ​కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ - బండి రమేష్ ​పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ - గూడూరు శ్రీనివాస్ ​భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫ...
Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!
Special Stories

Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!

​Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. ​నిల్వల్లో భారీ తేడాలు ​ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. ​అక్రమాల తీరు ఇలా.. ప్రభుత్...
error: Content is protected !!