జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్? – Jubilee Hills Byelection
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి.
జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...




