Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..
Mehul Choksi : వేల కోట్ల బ్యాంకు కుంబకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారి (Absconding diamond jeweller) మెహుల్ చోక్సీ (Mehul Choksi detained) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. బెల్జియం (Belgium)లోని యాంట్వెర్స్ నగరంలో అతడిని అరెస్టు చేసినట్టు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్ నుంచి పంపిన ఎక్స్‌ట్రడిషన్ డిమాండ్‌కు స్పందనగా ఆ దేశం అతడిపై ఈ మేరకు చర్యలు తీసుకుంది.
రూ. 13 వేల కోట్ల మోసం
భారత్‌లో చోటుచేసుకున్న పెద్ద కుంబకోణాల్లో లోన్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో చోటుచేసుకున్న మోసం కేసు ఒకటి. డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi ) ఇందులో ప్రధాన నిందితుడు. సుమారు రూ. 13,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు కలకలం రేపింది. 2018లో ఈ కుంబకోణం వెలుగుచూసింది.
బ్యాంకుకు బురిడీ కొట్టించి..
PNB ముంబైలోని బ్...




