ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి
ACB Trap in Narsangi : హైదరాబాద్: నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్ అనే వ్యక్తిని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...




