Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
HCU Land dispute | ముదురుతున్న  హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..
Trending

HCU Land dispute | ముదురుతున్న హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..

HCU Land dispute : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (University of Hyderabad) భూ వివాదం (Land dispute) ముదిరింది. విద్యార్థుల సంఘం (UoHSU) మంగళవారం నుంచి నిరవధిక నిరసనను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కోసం కంచ గ‌చ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల ఈ యూనివ‌ర్సిటీ భూమిని ఉపయోగించాలని నిర్ణ‌యించ‌గా విద్యార్థులు (students) దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఆ భూమి తమ విద్యాలయ పరిధిలోకి వస్తుందని, ప్ర‌భుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవ‌డం త‌గ‌ద‌ని వాదిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నిరసనలో పాల్గొని తరగతులను బహిష్కరించాలని (boycott classes) యూవోహెచ్ ఎస్‌యూ ఉపాధ్యక్షుడు ఆకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేస్తున్న నిర‌స‌న‌ల (protesting)ను పోలీసు శాఖ అణచివేయడానికి య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. HCU Land dispute : ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ గత ఆద...
Murder | మానుకోటలో దారుణ హత్య
Crime

Murder | మానుకోటలో దారుణ హత్య

గొడ్డలితో నరికి చంపిన దుండగులు Mahaboobabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య (Murder) కలకలం రేపింది. పార్థసారథి (42 ) అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్లిన దుండగులు అతడిన అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు.. ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని దుండగులు కాపు కాసి పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. మృతుడు పార్థసారథి (Parthasarathi) స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam). కాగా ఆయన ప్రస్తుతం మానుకోట జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ (health supervisor) గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతడిని పక్కా ...
Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..
Business

Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..

Gold rates : హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold rates) ఆకాశాన్ని (skyrocketed ) అంటాయి. వారం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి చివరి రోజుల్లోనే పలు సార్లు ఆల్ టైమ్ హైరికార్డులను బ్రేక్ (broke all-time high records multiple times) చేసిన రేట్లు ఏప్రిల్ 1 నాటికి మరింత పెరిగాయి. 22 క్యారెట్ బంగారం ధర రూ. 85,100 కు, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840 కు చేరింది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ ధర రూ. 850, 24 క్యారెట్ ధర రూ. 930 పెరిగాయి. మార్చి 31 నాటికి 22 క్యారెట్ ధర రూ. 84,250, 24 క్యారెట్ ధర రూ. 91,910 గా ఉండగా వాటిని మళ్లీ అధిగ‌మించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే.. మార్చి 26 నాటికి 22 క్యారెట్ బంగారం ధర రూ. 81,950, 24 క్యారెట్ బంగారం రూ. 89,400 ఉండగా, ఒక్క వారం రోజుల్లోనే 2.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 78,000 ఉం...
April Fools Day | స‌ర‌దా మోసాల వేడుక‌.. ఏప్రిల్ ఫూల్స్‌డే.. అసలు చరిత్ర ఇదే..
LifeStyle, Special Stories

April Fools Day | స‌ర‌దా మోసాల వేడుక‌.. ఏప్రిల్ ఫూల్స్‌డే.. అసలు చరిత్ర ఇదే..

April Fools Day : ఏప్రిల్ 1 అనగానే అందరికీ ప్రాంక్స్ (prank), సరదా మోసాలు, నవ్వుల సందడి గుర్తుకొస్తాయి. ఈ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఎవరో ఒకరిని స‌ర‌దాగా మోసపెట్టడానికి ప్లాన్ వేసుకుంటారు. అయితే.. ఈ ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర (April Fools Day HISTORY) ఏమిటి? ఇదెందుకు అంత‌గా ప్రాచుర్యం పొందింది.. దీని వెనుక ఉన్న నేప‌థ్యం ఏమిటి? తెలుసుకుందాం. April Fools Day అసలు ఎలా వచ్చిందంటే.. ఒకప్పటి ఫ్రాన్స్‌లో జనవరి 1 స్థానంలో ఏప్రిల్ 1ను నూతన సంవత్సరంగా జరుపుకునే సంప్రదాయం ఉండేది. కానీ, 1582లో పోప్ గ్రెగొరీ (Pope Gregory) XIII జనవరి 1ను నూతన సంవత్సరంగా ప్రకటించారు. అయితే, పాత సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉన్న వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని పిలుస్తూ సరదాగా మోసపెట్టడం మొదలైంది. భారతదేశంలో హోలీ పండుగ, ఏప్రిల్ ఫూల్స్ డే మధ్య కొంత సామీప్య‌త ఉంది. భారతదేశంలో హోలీ పండుగలో కూడా సరదాగా రంగులు ...
error: Content is protected !!