Banned registration | ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.. ఎక్కడంటే..
Banned registration : రంగరెడ్డి జిల్లా (Ranga Reddy district)లోని మాదాపూర్, శేరిలింగంపల్లి (Madhapur in Serilingampally) మండలాల్లోని కొన్ని భూముల రిజిస్ట్రేషన్ల (banned registration)ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government ) నిషేధించింది. ఇవి ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. ఇది అక్కడి భూ యజమానులను ఆందోళన కలిగిస్తోంది. ఈ భూములు (Plots) హైటెక్ సిటీ, స్టార్ హోటళ్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఇతర వ్యాపార సంస్థల సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ స్కైస్క్రేపర్లు, మల్టీ స్టోరీ భవనాలు నిర్మించగా, కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పత్రికానగర్ (Patrika Nagar) ప్రాంతంలో జర్నలిస్టులు (journalists) కొన్న 20 ఎకరాల స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి.
భూములు కొన్నవారికి షాక్
ఈ భూములను కంచా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు, ఖరిజ్ ఖాతా భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వచ్చేవిగా ప్...




