Indian National flag | లండన్‌లో భారతీయ జాతీయ జెండాకు అవమానం
Insult to Indian national flag : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Indian External Affairs Minister S Jaishankar) లండన్‌లో పర్యటిస్తున్న క్రమంలో అక్కడ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఖలిస్తానీ (Khalistani) వాదులు ఆయన కారుకు అడ్డంగా వచ్చి నిరసన ప్రదర్శించారు. వీరిలో ఒక వ్యక్తి భారత జాతీయ పతాకాన్ని చించివేశాడు. ఇది మార్చి 4న జరగ్గా ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
Insult to Indian national flag : అసలేం జరిగింది?
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లండన్‌లో (London) ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శితో వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం, జియోపాలిటిక్స్ వంటి అంశాలపై చర్చించారు. మార్చి 9 వరకు ఆయన లండన్‌లో ఉండే అవకాశం ఉంది. మార్చి 4న లండన్‌లోని చతమ్ హౌస్ (Cahtham House) వేదికలో జరిగిన చర్చ అనంతరం జైశంకర్ తన కారు వైపు వెళ్తున్న సమయం...




