Employment for women | మహిళలకు ఉపాధి అవకాశం.. Rapido తో ప్రభుత్వం ఒప్పందం
Employment for women : మహిళా సాధికారతపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందుకు ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవల కంపె నీ రాపిడో (Rapido)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన మహిళలకు ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ (driving licence) కలిగి ఉన్న వారికి రాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికుల సేవలను అందించేలా ఈ స్కీమ్‌ను ప్లాన్ చేశారు.
విశాఖ, విజయవాడలో అంకురార్పణ
ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మొదటగా విశాఖపట్నం, విజయవాడలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు నగరాల్లో సుమారు 400 ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తర్వాత క...




