Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
State

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

Ravi Teja Next Movie | మాస్ మహారాజా రవితేజ (Mass Maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు. Ravi Teja కొత్త డైరెక్టర్ చేతిలో 75 వ మూవీ.. ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu Bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (Srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవ...
Graduate MLC Election | నువ్వా నేనా అన్నట్లుగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు
State

Graduate MLC Election | నువ్వా నేనా అన్నట్లుగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు

Karimnagar Graduate MLC Election Results : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు 10 రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా ఆధిక్యం త‌గ్గుతూ వ‌స్తోంది. అయితే వరుసగా 9 రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6వ, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 211 వోట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఇక ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు వోట్ల ఆధిక్యం లభించినట్లు స‌మాచారం. ఇంకా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఈ నెల 3న వోట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆ రోజంతా చెల్లని ...
Ranya Rao Arrest | 15 కిలోల బంగారంతో ప‌ట్టుబ‌డిన క‌న్న‌డ న‌టి..
Crime

Ranya Rao Arrest | 15 కిలోల బంగారంతో ప‌ట్టుబ‌డిన క‌న్న‌డ న‌టి..

Ranya Rao Arrest : క‌న్నడ పినీ న‌టి రాన్యా రావ్ (Kannada film actress Ranya Rao) అరెస్టు అయ్యారు. 15 కేజీల బంగారంతో ఆమె పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దుబాయ్ నుంచి బెంగ‌ళూరు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Bengaluru International Airport)లో ఫ్లైట్ దిగిన ఆమె డైరెక్ట‌ర్ ఆఫ్‌ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు చిక్కారు. సినీ రంగంలో విశేష గుర్తింపు పొందిన రాన్యా రావ్ క‌ర్ణాట‌కలోని ఓ పోలీసు ఉన్న‌తాధికారి (IPS officer) కూతుర‌ని, ఎవ‌రికీ అనుమానం రాకుండా కొంత‌కాలంగా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మ‌గ్లింగ్ (gold smuggling) చేస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. విస్తుబోయిన DRI అధికారులు రాన్యా రావ్ ఈనెల 3న రాత్రి దుబాయ్ నుంచి బెంగ‌ళూరు కంపెగౌడ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డే ఉన్న‌ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence -DRI) అధికారులు ముందస్తు సమాచారం మేరకు తనిఖ...
Nala Conversion | నాలా కన్వర్షన్ కిం(సిం)గ్
Special Stories

Nala Conversion | నాలా కన్వర్షన్ కిం(సిం)గ్

ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు.. నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తున్న తహశీల్దార్ రియల్టర్ లకు సహకారం… ప్రభుత్వ ఆదాయానికి గండి Nala Conversion in Warangal | అవును ఇప్పుడు ఆ తహసీల్దార్ నాలా కన్వర్షన్ కిం(సిం)గ్ గా పేరు పొందినట్లు రెవెన్యూ శాఖ (Revenue Deportment)లో ప్రచారం జరుగుతోంది. అనుమతి లేని వెంచర్లు చేసే రియల్టర్లకు ఆ తహసీల్దార్ పెద్దదిక్కుగా మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఆ తహసీల్దార్ (Tahsildar) కు బాగానే కలిసొస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేయడం ద్వారా సదరు తహశీల్దార్ బాగానే వెనకేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తూ రియల్టర్ లకు సహకరిస్తున్న ఆ అధికారి పరోక్షం...
Mamnoor airport | మామునూర్ ఎయిర్‌పోర్టుకు భూ సేక‌ర‌ణ‌… రైతుల నుంచి నిర‌స‌న‌
State

Mamnoor airport | మామునూర్ ఎయిర్‌పోర్టుకు భూ సేక‌ర‌ణ‌… రైతుల నుంచి నిర‌స‌న‌

Mamnoor airport : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూర్ విమానాశ్రయం (Mamnoor airport) కోసం భూసేకరణ సర్వే (land acquisition survey) చేపట్టడంపై స్థానిక రైతులు తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్ర‌భుత్వం సర్వే ప్రారంభించింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు (farmers) ఈ రోజు ఆందోళ‌న‌కు దిగారు. నక్కాలపల్లి రోడ్డుపై నిర‌స‌నను ప్ర‌ద‌ర్శించారు. త‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ గ‌ట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతుల నిర‌స‌న ఎందుకు ? మామునూర్ ప్రాంతంలో ఒక ఎకరం భూమి కనీసం రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేస్తుందని, ప్రభుత్వం తగిన పరిహారం అందించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప‌రిహారం విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అధి...
error: Content is protected !!