Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీ.. త్వరలో 16,347 పోస్టుల భర్తీ
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెగా డీఎస్సీని ప్రకటించి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ పద్దులపై మంత్రి లోకేష్ చర్చించారు. మెగా డీఎస్సీ (AP mega DSC) ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3,000 కోట్లు అవసరమని తెలిపారు. ఈ పనులను మనబడి మనభవిష్యత్తు, ఉపాధి హామీ పథకాల కింద దశలవారీగా చేపడతామని చెప్పారు.
బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమైంది. కేటాయింపులు, సంక్షేమ నిధుల అంశాలపై సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను మంత్రి నారాయణ, అలాగే, ఏపీ ఫిల్మ్ అండ్ టె...




