MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..
Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు (MLC Elections) జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాలను కూడా అదే రోజు విడుదల చేస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడెక్కడంటే..
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతోపాటు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానుండగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన...




