Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Budget Session 2025 |  బడ్జెట్ సమావేశాలు షురూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
National

Budget Session 2025 | బడ్జెట్ సమావేశాలు షురూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

Budget Session 2025 LIVE : బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసంద‌ర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu), పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన కుంభోమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆమె స్మరించుకున్నారు. ప్రస్తుత పాలనా విజయాలను ప్ర‌స్తావిస్తూ గత ప్రభుత్వాల కంటే మూడింతల వేగంతో ప్రభుత్వం మూడోసారి అభివృద్ధి చెందుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అనంత‌రం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ప్ర‌సంగించారు. పేద, మధ్యతరగతి వారికి ఆశీస్సులు ప్రసాదించాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ సెషన్ 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం ) లక్ష్యాన్ని సాధించడంలో కొత్త విశ్వాసం శక్తిని నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు . దేశ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన రోడ్...
Guillain Barre Syndrome | హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసు
State

Guillain Barre Syndrome | హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసు

Guillain Barre Syndrome case in Hyderabad | భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌రం పెడుతున్న గులియన్-బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. కొత్త‌గా తెలంగాణ‌లోనూ దాపురించింది. తాజాగా హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈ అరుదైన‌ వ్యాధి (Guillain Barre Syndrome) నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తున్నారు. భారతదేశంలో GBS కేసులు భార‌త‌దేశంలో గులియ‌న్‌-బారే సిండ్రోమ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్రగా ఇవి అత్య‌ధికంగా న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 130 కేసులు న‌మోద‌య్యాయి. పూణె, సోలాపూర్ త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించారు. బాధితుల్లో ఇద్దరు ఇప్ప‌టికే మృతి చెందారు. దీంతో మహారా...
Warangal Jakaria : ఉగ్రవాదులతో సంబంధం లేదు : జకారియా
State

Warangal Jakaria : ఉగ్రవాదులతో సంబంధం లేదు : జకారియా

Warangal Jakaria : వరంగల్ శివనగర్ కు చెందిన జమాత్‌–ఉల్‌–ముస్లిమీన్‌ ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్ జకారియాను చైన్నె ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (Immigration officers) అదుపులోకి తీసుకొని విచారించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా దీనిపై జకారియా ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. త‌న బాధ‌ను వెల్ల‌బోసుకున్నారు. వరంగల్‌లో ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన ప్రచారం అంతా వట్టిదేనన‌ని తెలిపారు. తనకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు లేవని వరంగల్ కు చెందిన జకారియా కొట్టిపారేశారు. మూడు రోజులపాటు విచారణ అనంతరం తనకు నిషేధిత సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎన్ఐఏ అధికారులు గుర్తించార‌ని తెలిపారు. శ్రీలంకకు వెళ్తుండ‌గా అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, పూర్తిస్థాయి విచారణ జరిపి వదిలివేసినట్లు జకారియా వెల్ల‌డించారు. ఇదిలా ఉండగా 15 మంది సభ్యులతో కలిసి శ్రీలంకకు వెళ్లి వెళ్తుండగా అతడి...
Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు
State

Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు

Yadagiri Gutta Temple : తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ‌ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి (Yadagiri Gutta) ఆల‌యానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. త్వ‌ర‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో ప్ర‌త్యేక‌ బోర్డు ఏర్పాటుకు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌ మంత్రులు దేవాదాయ‌శాఖ అధికారులతో క‌లిసి స‌మీక్షించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్యమంత్రి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో మాదిరిగానే యాద‌గిరిగుట్ట ల‌క్ష్మిన‌ర‌సింహ స్వామి ఆల‌యం (Yadadri LakshmiNarasimha swami temple ) స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్ర‌తకు ఏమ...
Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం
Crime

Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం

వరంగల్: ఓరుగల్లులో (Warangal)లో ఉగ్రవాదుల (Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల (Pakistan Terrorists)తో సంబంధాలు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జాన్‌పాకకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు జ‌క్రియాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. కాగా, నిందితుడు జ‌క్రియా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా అరెస్టు అయిన వ్యక్తి భారత్ ల...
error: Content is protected !!