Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్
Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పర్యటిస్తున్నారు. ఆయన టూర్ రెండు రోజులపాటు కొనసాగనుంది. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారీ భద్రత నడుమ
కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్య...




